రాజ్యసభలో 57 స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికలు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్‌కు చివరి గడువు మే 31వ తేదీ. మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న 57 ఖాళీలకు ఈ ఎన్నికలు జరుగుతాయి.
యూపీలో 11, ఏపీలో 4, రాజస్థాన్ లో 4, చత్తీస్‌ఘడ్ లో 4, జార్ఖండ్ లో 2, మహారాష్ట్రలో 6, తమిళనాడులో 6, పంజాబ్ లో 2, ఉత్తరాఖండ్ లో 2, బీహార్ లో 5, తెలంగాణలో 2, హర్యానాలో 2, మధ్యప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3 స్థానాలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి సహా.. బీజేపీ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్‌ల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకే కొత్తగా ఎన్నికలు జరగనున్నాయి.