లక్నోపై గుజరాత్ గెలుపు..

75
gujarath
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా లక్నోపై గ్రాండ్ విక్టరీ కొట్టింది గుజరాత్. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్రో…82 పరుగులకే చాపచుట్టేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గుజరాత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీపక్ హూడా (27) మినహా మరెవరూ రాణించలేదు. క్వింటన్ డికాక్ 11 , కేఎల్ రాహుల్ 8,,కరణ్ శర్మ 4 ,కృనాల్ పాండ్యా 5,మార్కస్ స్టాయినీస్ 2 విఫలమయ్యారు.రషీద్ ఖాన్ 3.5 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి లక్నో ఓటమిని శాసించాడు.

ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్… 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ 49 బంతుల్లో ఏడు ఫోర్లతో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ తెవాతియా 16 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

- Advertisement -