మాచర్ల నియోజకవర్గం..న్యూ రిలీజ్ డేట్

43
nithin
- Advertisement -

యువ కథానాయకుడు హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ కి MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

తొలుత జూలై 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినా తాజాగా కొత్త రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులు.

- Advertisement -