రివ్యూ: మాచర్ల నియోజకవర్గం

190
nithin
- Advertisement -

ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రంతో నితిన్ హిట్ కొట్టాడా లేదాచూద్దాం..

కథ:

తొలిసారి కలెక్టర్ పాత్రలో నటించారు హీరో నితిన్. దుర్మార్గులైన రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు గుంటూరుకు జిల్లా కలెక్టర్ గా ఎంట్రీ ఇస్తారు. అయితే అక్కడ కొన్ని ఏళ్ల పాటు ఎన్నికలు జరగకపోవడంతో పరిస్థితులను చక్కదిద్ది ఎన్నికలు జరిపిస్తారు. ఈక్రమంలో నితిన్ ఎదుర్కొనే సమస్యలేంటి? చివరకు కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ కథ, నితిన్ నటన, సంగీతం, డైలాగ్స్, కామెడీ. కలెక్టర్ పాత్రలో ఒదిగిపోయారు నితిన్. డిఫరెంట్ పాత్రతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నితిన్‌తో పోటీపడి నటించింది కృతిశెట్టి. తన అందాలతో మతి పోగొట్టింది. వెన్నెల కిషోర్, మురళి శర్మ, రాజేంద్రప్రసాద్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం అయిన ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకోగా ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం..

తీర్పు:

తన కెరీర్‌లోనే తొలిసారి డిఫరెంట్ పాత్రలో నటించారు నితిన్. కలెక్టర్ పాత్రలో మెప్పించగా కామెడీ, సంగీతం ప్లస్ పాయింట్ కాగా కొన్ని సన్నివేశాలు మైనస్ పాయింట్స్‌. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం మాచర్ల నియోజకవర్గం.

విడుదల తేదీ: 12/08/2022
రేటింగ్‌: 2.5/5
నటీనటులు: నితిన్, కృతిశెట్టి
సంగీతం: మహతి సాగర్
నిర్మాత: సుధాకర్ రెడ్డి
దర్శకత్వం: ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి

- Advertisement -