అలా చేస్తే కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు: సీజేఐ

46
ramana
- Advertisement -

మున్సిపాల్టీలు, గ్రామ పంచాయితీలు స‌క్ర‌మంగా డ్యూటీ నిర్వ‌హిస్తే, పోలీసులు స‌రైన రీతిలో విచార‌ణ‌లు చేప‌డితే, అక్ర‌మ క‌స్ట‌డీ మ‌ర‌ణాల‌ను నిరోధిస్తే, అప్పుడు ప్ర‌జ‌లు కోర్టుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని సీజే ర‌మ‌ణ తెలిపారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,హైకోర్టు చీఫ్ జస్టిస్‌లతో ఢిల్లీలో జరిగిన సంయుక్త సమావేశంలో మాట్లాడారు సీజేఐ రమణ.

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ విధుల నిర్వ‌హ‌ణ‌లో ల‌క్ష్మ‌ణ రేఖ‌ను గుర్తుంచుకుని ప‌నిచేయాల‌ని సూచించారు. ఒక‌వేళ అన్నీ చ‌ట్టంలోబ‌డే జ‌రిగితే, అప్పుడు పరిపాల‌నా వ్య‌వ‌స్థ‌కు న్యాయ‌వ్య‌వ‌స్థ అడ్డురాదు అన్నారు.

దేశానికి హాని క‌లిగించే అంశాల‌పై కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా.. కావాల‌నే ఆ తీర్పు అమ‌లులో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఆరోపించారు. విధాన నిర్ణ‌యాలు త‌మ ప‌రిధిలోకి రావ‌ని, కానీ ఎవ‌రైనా వ్య‌క్తి త‌మ వ‌ద్ద‌కు ఫిర్యాదుతో వ‌స్తే, ఆ వ్య‌క్తిని కోర్టు తిర‌స్క‌రించ‌ద‌ని తెలిపారు.

- Advertisement -