మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కరక్టే: సీపీఐ నారాయణ

105
cpi
- Advertisement -

ఏపీలో కరెంట్, రోడ్ల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వైసీపీ నేతలు కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ…ఏపీలోని మౌళిక సదుపాయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవేనని తెలిపారు.

కేటీఆర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు నారాయణ. చిత్తూరు జిల్లా న‌గ‌రి మండ‌లంలోని త‌న స్వ‌గ్రామం అయనంబాకం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయ‌ని తెలిపారు. ఏపీలో రోడ్లు గుంత‌ల‌మ‌యంగా ఉంటే… పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రోడ్లు చ‌క్క‌గా ఉన్నాయ‌ని..ఈ విష‌యాన్ని ఆధారాలతో సహా చూపించారు నారాయణ.

ఆంధ్రా- త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దు ప్రాంతాన్ని సందర్శించిన నారాయణ..తమిళనాడు రోడ్లతో పోల్చిచూస్తే ఏపీ రోడ్లు… న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంద‌ని వెల్లడించారు.

- Advertisement -