- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 3,377 కేసులు నమోదుకాగా 60 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరగా 4,25,30,622 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 17,801 యాక్టివ్ కేసులుండగా 5,23,753 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉన్నాయి. ఇప్పటివరకు 1,88,65,46,894 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -