భారత్‌లో కొత్తరకం వేరియంట్ !

75
variant
- Advertisement -

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొత్త రకం కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా కొత్త స‌బ్‌ వేరియంట్‌ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్‌)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 బ‌య‌ట‌ప‌డింది. ఇది క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 స‌బ్‌ వేరియంట్‌కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, త‌గి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. బీఏ.12 స‌బ్‌ వేరియంట్‌ను మొద‌ట యూఎస్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఈ స‌బ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి.

దేశంలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ 13 శాంపిళ్ల‌ను ప‌రీక్షించగా అందులో ఒక‌టి బీఏ.12 స‌బ్ వేరియంట్‌గా తేలిందని అధికారులు తెలిపారు.

- Advertisement -