రివ్యూ: ఆచార్య

351
acharya
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం‘ఆచార్య’. హిట్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ , సాంగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం అందరిని మెప్పించిందా లేదా చూద్దాం..

కథ:

ధర్మస్థలి ఆలయ పట్టణం బసవ (సోనూ సూద్) నిరంకుశ పాలనలో ఉంటుంది. ఆచార్య (చిరంజీవి) ధర్మస్థలిలోకి ప్రవేశించి బసవ ఆగడాలను ఎదురిస్తుంటాడు. ధర్మస్థలిని రక్షించడానికి ఆచార్య ఎందుకువచ్చాడు…? ఆది సిద్ద(రామ్ చరణ్‌)కు చిరుకు ఉన్న సంబంధం ఏంటీ..? ధర్మస్థలి ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ చిరు,రామ్ చరణ్ నటన, సాంగ్స్‌,యాక్షన్ సీన్స్.చిరు,రామ్ చరణ్ నటన సినిమాకు ప్లస్ పాయింట్స్‌. ముఖ్యంగా డ్యాన్స్‌,ఫైట్స్ ఇరగదీశారు. భలే బంజారా పాటలో చిరు మరియు చరణ్ ల గ్రేస్ ఫుల్ డ్యాన్స్ విజువల్ ట్రీట్. పూజా హెగ్డే తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. మిగితా నటీనటుల్లో సోనూ సూద్, జిషు సేన్ గుప్తా, తనికెళ్ళ భరణి ,సత్య దేవ్ మెప్పించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ కథ,పేలవమైన కథనం, రొటీన్ ఎమోషన్స్ .

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. మణిశర్మ సంగీతం బాగుంది. ‘లాహే లాహే’, ‘భంజారా’ సాంగ్స్ సూపర్బ్. తిరు సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. అటవీ ప్రాంతాలను మరియు పచ్చదనాన్ని చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి కథాంశంతో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. చిరు నటన,డ్యాన్స్, ఫైట్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా కథ, కథనం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం ఆచార్య.

విడుదల తేదీ:29/04/2022
రేటింగ్:2.5/5
నటీనటులు: చిరంజీవి,రామ్ చరణ్,పూజా హెగ్డే
సంగీతం: మణిశర్మ
నిర్మాత: నిరంజన్ రెడ్డి,రామ్ చరణ్
దర్శకత్వం: కొరటాల శివ

- Advertisement -