మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ – విజయవాడ హై వే లో కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దగ్గర ఉండి సేవలు అందించారు.పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని మేళ్ళ చెరువు వెళుతున్న మంత్రి … కళ్ళ ముందే ఓ వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 3 తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ వైపు వస్తున్న ఒక టూ వీలర్ ని వెనుక నుండి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టిన ఘటన జరిగింది.వెంటనే స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు 108 నెంబర్ కి ఫోన్ చేయించారు.స్థానిక ప్రజలతో కలిసి దగ్గరుండి క్షతగాత్రులను సమీప వైద్యశాలకు పంపించారు.జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
అక్కడకు చేరుకున్న పోలీసులతో కలిసి అక్కడే ఉండి ట్రాఫిక్ ని క్లియర్ చేయించారు. జరిగిన విషాద ఘటన పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు.వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.