- Advertisement -
టాలీవుడ్ భామ అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లయింది. కాజల్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో వీరి పెళ్లి జరిగింది. జనవరి 8న తాను గర్భవతినంటూ కాజల్ ప్రకటించింది. అప్పటినుంచి తన గర్భానికి సంబంధించిన అనేక సంగతులను కాజల్ క్రమం తప్పుకుండా అభిమానులతో ఫొటోల రూపంలో పంచుకుంటోంది.
తాజాగా కాజల్ కు కొడుకు పుట్టాడన్న వార్తతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి యువరాజు పుట్టాడంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవాళే ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ క్యూట్ చిన్నారిని అందరికీ ఎప్పుడు పరిచయం చేస్తారని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫాలోవర్లు, నెటిజన్లు, అభిమానులు.
- Advertisement -