మెగా154 లేటెస్ట్‌ అప్‌డేట్‌..

77
Chiranjeevi
- Advertisement -

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ మూవీ ష్యూటింగ్‌ మొదలై శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. అయితే ఈ మెగా 154 చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా శృతిహాసన్ ఈ మూవీ ష్యూటింగ్‌ షెడ్యూల్‌లో జాయిన్ అయిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చింది.

ఈ షెడ్యూల్‌లో శృతి హాసన్, చిరంజీవిల మధ్య కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. భారీ రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చిరంజీవి లుక్‌ కూడా విడుద‌ల చేసి సినిమా పట్ల ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఇందులో ‘గ్యాంగ్ లీడ‌ర్’ సినిమా స్టైల్‌ మాస్ లుక్‌లో ఆయన కనిపించడంతో మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం.

- Advertisement -