అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బేబీ బంప్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ. అయతే తాజాగా ఈ అమ్మడు తన భర్త గౌతమ్ కిచ్లూ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
‘డియర్ గౌతమ్… గొప్ప భర్తగా ఉన్నందుకు, ప్రతి బిడ్డ కోరుకునేంత మంచి తండ్రిగా ఉండబోతున్నందుకు ధన్యవాదాలు. అలసటగా ఉన్నప్పుడు, రాత్రుళ్లు సరిగా నిద్రలేనప్పుడు నువ్వు కూడా నాతో పాటు నిద్రలేచి, నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ సౌకర్యవంతంగా ఉండేలా చేశావు. ప్రతి క్షణం నన్ను ఎంతో సంరక్షించావు. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేశావు. త్వరలోనే మన ముద్దుల బిడ్డ ఈ లోకంలోకి వస్తుంది. ఆలోగా నీవు ఎంత గొప్ప వ్యక్తివో నీకు తెలియజేయాలనుకుంటున్నా.. గత 8 నెలల్లో నీలో ఒక గొప్ప తండ్రిని చూశా. పుట్టబోయే బిడ్డను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో, బిడ్డ సంరక్షణ కోసం నీవు ఎంతగా శ్రమిస్తున్నావో నాకు తెలుసు. నీ అమితమైన ప్రేమ మన బిడ్డ అదృష్టంగా భావిస్తున్నా. బిడ్డకు నీవు ఎప్పుడూ ఒక ప్రేరణగా ఉండాలని కోరుకుంటున్నా.
త్వరలోనే మన జీవితాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పటిలా మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోలేం. సినిమాలు, షికార్లకు వెళ్లలేం. టీవీ చూస్తూ లేట్ నైట్స్ నిద్రించలేం. పార్టీలకు దూరమవుతాం. వీటన్నింటికి దూరమైనా బిడ్డతో విలువైన సమయాన్ని గడుపుతాం. మన జీవితంలో ప్రతిక్షణం మరింత ఆనందంగా మారుతుంది. పరిస్థితులు మారొచ్చు కానీ, నాపై నీకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఐ లవ్యూ’ అంటూ భర్తను ఉద్దేశించి పోస్ట్ షేర్ చేసింది.