సీఎం కేసీఆర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్. జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వడ్ల సేకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని …జిల్లాల వారీగా ప్రతీ రోజూ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించి, పర్యవేక్షించాలన్నారు.
కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు రోజూ కనీసం నాలుగు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. గన్నీ బ్యాగుల సేకరణపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏవైనా సమస్యలు వస్తే అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు.