వివాదంలో ప్రగ్యా…!

152
pragya
- Advertisement -

సినీ నటులు వివాదంలో చిక్కుకోవడం కొత్తకాదు. తాజాగా అందాల బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏంటంటారా? ఒక మద్యం బ్రాండ్ కు ఆమె చేసిన ప్రచారమే దీనికి కారణం.

ప్రపంచ నెం. 1 బోర్బన్ ను ప్రేమించండి. బాధ్యతాయుతంగా తాగండి. 25 సంవత్సరాలు పైబడినవారే తాగాలి అని యాడ్‌లో పేర్కొంది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం కాగా దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

మధ్యపానాన్ని ఆమోదించడం ద్వారా మీరు యూత్ కు ఏం మెసేజ్ ఇస్తున్నారు?,ఆ ఆల్కాహాల్ యాడ్ చూసిన తర్వాత నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను?, ఆన్ లైన్ తాగుబోతు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీని పై ప్రగ్యా జైస్వల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -