- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత24 గంటల్లో 1054 కరోనా కేసులు నమోదుకాగా 29 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,35,271కి చేరగా 4,25,02,454 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 11,132 యాక్టివ్ కేసులుండగా 5,21,685 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 1,85,70,71,655 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -