- Advertisement -
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఢిల్లీలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు…కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖార్గే, అధిరంజన్ చౌధురి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు తదితర ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ భవనంలోని గాంధీ విగ్రహం వరకు “నిరసన మార్చ్” నిర్వహించారు.
గత పది రోజుల్లో 9 సార్లు పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయాని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పెట్రోల్,డీజీల్ ధరలను తగ్గించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
- Advertisement -