- Advertisement -
అఖండ భారీ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్నారు బాలయ్య. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా ఉగాది కానుకగా ఫస్ట్ లుక్,టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్‌కానుందట.
ఇక ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో కన్నడ నటుడు దునియా విజయ్‌తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించనున్నారు. తమన్ సంగీతం సమకూర్చనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు.
- Advertisement -