- Advertisement -
మార్చి 1 నుండి 31 వరకు ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు పోలీసులు అవకాశం కల్పించగా దీనికి మంచి స్పందన వస్తోంది. చలాన్లు క్లియర్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుండగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 1.2 కోట్ల చలాన్లను క్లియర్ చేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాలో ఇప్పటి వరకు రూ. 112.98 కోట్లు జమ అయ్యాయి.
వీటిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 లక్షల చలాన్లు క్లియరెన్స్ కాగా రూ. 15.3 కోట్లు జమ అయ్యాయి. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 63 లక్షల చలాన్లు క్లియరెన్స్ కాగా, రూ. 49.6 కోట్ల ఆదాయం వచ్చింది. సైబరాబాద్ పరిధిలో 38 లక్షల చలాన్లు క్లియరెన్స్ కాగా, రూ. 45.8 కోట్లు జమ అయ్యాయి.
మార్చి 31 తర్వాత చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
- Advertisement -