- Advertisement -
మరో కొద్ది రోజుల్లో (మార్చ్ 25) ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. సినిమా ఎప్పుడు చూద్దామా అన్నంతగా అభిమానులు ఆత్రుతగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్.ఈక్రమంలో దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈరోజు గుజరాత్ లోని కెవాడియా వచ్చారు. ఇక్కడి సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్)ని సందర్శించారు.
ఆర్ఆర్ఆర్ టీమ్ రాకతో అక్కడ కూడా సందడి నెలకొంది. మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దాంతో రాజమౌళి, చరణ్, తారక్ తమ చిత్రం గురించి వారికి వివరించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాగా, ఈరోజు బరోడా, ఢీల్లీలో ప్రమోషనల్ కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు.
- Advertisement -