హిజాబ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు

111
hc
- Advertisement -

హిజాబాద్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరికాదని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టిపారేసింది. ఇస్లాంలోనూ హిజాబ్ ధరించడం తప్పనిసరి అని లేదని తెలిపింది.

విద్యా సంస్థల్లోకి హిజాబ్‌‌కు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌లపై ఫిబ్రవరి 10 నుంచి రెండు వారాల పాటు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని హైకోర్టు విస్తృత ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించి తీర్పు వెలువరించింది.

హిజాబ్ వివాదంపై తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బెంగళూరు, మంగళూరు నగరాల్లో వారం రోజుల పాటు 144వ సెక్షన్‌ విధించింది. కర్ణాటక వ్యాప్తంగా మార్చి 15 నుంచి 21 వరకు మద్య నిషేధం ప్రకటించింది. వివాదం మొదలైన ఉడుపిలో విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు.

- Advertisement -