రెండోసారి శాసనమండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
2019, సెప్టెంబర్ 11న తొలిసారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2021లో ఎమ్మెల్సీ పదవికాలం ముగియగా తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
నల్లగొండ జిల్లా ఊరుమడ్ల గ్రామంలో 1954, ఫిబ్రవరి 2న జన్మించిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. తర్వాత 2009,2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. 2018లో గుత్తాను సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు.