కంటోన్మెంట్ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

54
ktr
- Advertisement -

కంటోన్మెంట్ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్… కంటోన్మెంట్ అధికారులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. వాళ్లు రోడ్లు బంద్ చేస్తే.. తాము క‌రెంట్, నీళ్లు బంద్ చేస్తామ‌ని స్పష్టం చేశారు.

కంటోన్మెంట్ అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే పిలిచి మాట్లాడాల‌ని స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీని ఆదేశిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. ఒక వేళ వారు విన‌క‌పోతే తీవ్ర‌మైన చ‌ర్య‌ల‌కు, క‌ఠిన చ‌ర్య‌ల‌కు కూడా వెనుకాడొద్దని…పైసా సాయం చేయ‌రు కానీ ప‌ని చేస్తున్న ప్ర‌భుత్వానికి అవ‌రోధం క‌లిగించ‌డం స‌రికాద‌ని మండిప‌డ్డారు.

ఒక వైపు కంటోన్మెంట్‌లో చెక్ డ్యాం క‌ట్టి నీళ్లు ఆప‌డంతో న‌దీం కాల‌నీ మునిగిపోతోంది. శాతం చెరువు నుంచి గోల్కొండ కింద‌కు ఏఎస్ఐ అనుమ‌తి తీసుకొని నీళ్లు వ‌దులుదామంటే అక్క‌డ ఏఎస్ఐ అనుమ‌తి ఇవ్వ‌డం లేదని మండిపడ్డారు కేటీఆర్. ప్ర‌జ‌ల కోసం ఎంత‌కైనా తెగిస్తాం అన్నారు.

- Advertisement -