మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కృషి: కేటీఆర్

131
minister
- Advertisement -

మూసీ సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్…మూసీ న‌ది అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుందన్నారు.

మూసీకి శాశ్వ‌త ప‌రిష్కారం చూపేందుకు ప్లాన్ చేశామ‌న్నారు. హైద‌రాబాద్‌లో మేజ‌ర్ నాలాలు 54 ఉన్నాయి. 94 శాతం సీవ‌రేజ్ మూసీలోకి వ‌స్తుంద‌న్నారు. మూసీ అంటేనే మురికి కూపం గుర్తులాగా మిగిలిపోయిందని తెలిపారు.

నాగోల్, చాద‌ర్ ఘాట్, ముస్లింజంగ్ బ్రిడ్జి వ‌ద్ద మూసీ అంచుల‌పై వాక్ వేల‌తో పాటు, సుందరీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌న్నారు. మూసీలో తేలియాడే చెత్త‌ను తొల‌గించేందుకు ప‌ది ప్ర‌దేశాల్లో ఫ్లోటింగ్ ట్రాష్ బారియ‌ర్స్‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.

- Advertisement -