సెలబ్రెటీలు..చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ … ?

105
tollywood
- Advertisement -

ఓ వైపు టెక్నాలజీ పెరుగుతోంది…మరోవైపు వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరుగెడుతోంది. ఒకప్పుడు 60 పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి.నేడు, 40 ఏండ్లలోపు వారినీ హృద్రోగం మింగేస్తున్నది. చిన్నవయసులో గుండె సమస్యలకు అనేక కారణాలు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తూ ఓ కారణం కావచ్చు.

ఇక ఇటీవలి కాలంలో సెలబ్రెటీలు పునీత్ రాజ్ కుమార్,మేకపాటి గౌతమ్‌రెడ్డి,తాజాగా షేన్ వార్న్‌.. వీరి రంగాలు వేర్వేరు అయినా చనిపోయింది మాత్రం ఒక్కటే కారణం. హార్ట్ స్ట్రోక్. ఎందుకంటే కొంతకాలంగా వీఐపీలు ఇలా చనిపోవడం అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా చనిపోయిన షేన్ వార్న్ పరిస్థితి ఇందుకు భిన్నం.క్రికెట్‌లో వార్న్‌ లెజెండ్ ఆటగాడే కానీ అతడి వ్యక్తిగత జీవితానికి,ఆటకు ఏమాత్రం సంబంధం లేదు. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత విపరీతంగా మద్యానికి అలవాటైన వార్న్‌…అంతటితో ఆగలేదు. పలువురు మహిళలతో సెక్స్‌వల్ సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. ఇది వార్న్ జీవనశైలీలో మార్పులు తీసుకురాగా అదే అతడి మరణానికి దారితీసింది.

1995లో సిమన్ కల్లహన్‌ను పెళ్లి చేసుకున్న షేన్ వార్నే.. 2005లో విడిపోయాడు. తర్వాత ఇంగ్లిష్ నటి ఎలిజబెత్ హర్లీతో వార్నే డేటింగ్ చేశాడు. 2011లో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. కానీ 2013లో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. తర్వాత ఓ ఇంటర్వ్యూలో సింగిల్ పేరెంట్‌గా ఉండటం కష్టమే అని తెలిపిన వార్న్‌…తన జీవనశైలీలో వచ్చిన మార్పుల వల్ల హఠాన్మరణం చెందారు.

ఇక ఏపీకి చెందిన మంత్రి గౌతమ్‌ రెడ్డి సైతం గుండెపోటుతో మృతిచెందారు. ఏపీకి పెట్టుబడుల కోసం దుబాయ్ పర్యటనకు వెళ్లిన గౌతమ్‌…అక్కడే అస్వస్థతకు గురయ్యారు. అయితే తనకు వచ్చిన ఛాతినొప్పిని లైట్ తీసుకున్న గౌతమ్ ఇండియాకు వచ్చిన తర్వాత తన భార్యతో కలసి ఓ వివాహ వేడుకకు హాజరై అలసిపోయాడు. ఇక ఉదయాన్నే తిరిగి వ్యాయామం చేసిన విశ్రాంతి లేకపోవడంతో గుండెపోటుతో మృతిచెందారు. కాస్త విశ్రాంతి తీసుకున్నా లేదా డాక్టర్‌ను సంప్రదించినా గౌతమ్‌ ప్రానాలతో ఉండేవారు. ప్రాణాలతో ఉండేవారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

పునీత్ కూడా గుండెపోటుతో మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమకి గుండెపోటు శాపం అన్నట్టు మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కన్నడ సినీ పరిశ్రమ వాళ్ళు గుండెపోటుతోనే మరణించడం ఇందుకు కారణం. కన్నడ సీనియర్ డైరెక్టర్ సత్యజిత్ , హీరో చిరంజీవి సర్జా ,సీనియర్ యాక్టర్ కొడంగనూర్ జయకుమార్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇక ముఖ్యంగా రెగ్యులర్‌గా జిమ్‌తో యాక్టివ్‌గా ఉండే పునీత్ గుండె సంబంధిత సమస్యల వల్ల చనిపోతాడని ఎవరూ అనుకోలేదు. మితిమీరిన వ్యాయామం పునీత్ మరణానికి కారణం.

సాధారణంగా పుట్టిన ఏడాది కాలం నుంచీ ప్రతి వ్యక్తిలో కొంత మేర రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఉండటం సహజం. ఇది వయసుతో పాటు అతి నెమ్మదిగా పెరుగుతుంది. అయితే, ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఫలితంగా ఈ బ్లాకేజ్‌ ఒక్కసారిగా తీవ్రం అవుతుంది. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగా మారుతుంది. ప్రతీరోజు వ్యాయామం చేయకుండా, ఒకేసారి మితిమీరిన కసరత్తుకు సిద్ధపడితే గుండె మీద భారం పడి….. అది గుండెపోటుకు దారితీసే ఆస్కారం ఉంది. మొత్తంగా మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఒంటికి ఏదైనా అతి మంచిది కాదు.

- Advertisement -