ఉదయాన్నే సంతాప ట్వీట్..సాయంత్రానికి హఠాన్మరణం

144
shane
- Advertisement -

ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. వార్న్ మృతితో క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురికాగా వార్న్ చేసిన చివరి ట్వీట్ ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవాళ ఉదయం ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ కూడా గుండెపోటుతో మరణించారు. 1970 నుంచి 1984వ సంవత్సరం వరకు ఆస్ట్రేలియా తరపున 96 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రాడ్ మార్ష్ అడిలైడ్ ఆసుపత్రిలో మృతిచెందారు. రాడ్ మార్ష్ మృతికి సంతాపం తెలిపిన వార్న్‌…అతడో లెజెండ్ అని.. ఎంతో మందికి ప్రేరణ అని పేర్కొన్నాడు. మార్నింగ్ సంతాప ట్వీట్ వేసిన వార్న్.. సాయంత్రానికి గుండెపోటుతో మరణించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

- Advertisement -