నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం గట్టి పట్టుదల, కృత నిశ్చయంతో ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారం గేట్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందని….. రూ. 72 కోట్లతో రోడ్డు అండర్ బ్రిడ్జిని నిర్మించామన్నారు.హైదరాబాద్ నగరంలో అవసరమైన చోట ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నేతృత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తుకారం గేట్ ఒక్కటే కాదు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ కింద రూ. 6 వేల కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు.