- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా తాజాగా వైద్య పరికరాలు తయారు చేసే ఎస్3వీ వ్యాస్క్కులార్ టెక్నాలజీస్ అనే సంస్థ తమ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటుచేయనుంది.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్.
ఈ కంపెనీ ద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుందని…సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు కేటీఆర్. ఎస్3వీ వ్యాస్క్యులార్ టెక్నాలజీస్ రూ.250 కోట్ల పెట్టుబడితో… మెడికల్ డివైజెస్ పార్క్లో తమ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 250 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపారు.
- Advertisement -