రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు

138
sharwa
- Advertisement -

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది…ఈ సినిమాతో శర్వా మెప్పించాడా లేదా చూద్దాం..

కథ:

చిరంజీవి (శ‌ర్వానంద్‌) ఆడ‌వాళ్ల చుట్టూ పెరుగుతాడు. అమ్మ (రాధిక‌), పిన్న‌మ్మ‌లు, బాబాయ్‌లూ.. ఇదే త‌న ప్ర‌పంచం. రాజ‌మండ్రిలో ఓ క‌ల్యాణ‌మండ‌పం న‌డుపుతుంటాడు. త‌న‌కు పెళ్లికావ‌డం లేద‌న్న బాధ త‌ప్ప ఇంకేం లేదు. ఈ క్రమంలో అనుకోకుండా ఓరోజు ఆధ్య (ర‌ష్మిక‌)తో ప‌రిచ‌యం అవుతుంది. ఆధ్య చిరుని ఇష్ట‌ప‌డుతుంది. అయితే చిరు మాత్రం ఆధ్య‌ని ప్రేమిస్తాడు. త‌న మ‌న‌సులోని మాట చెప్పేస్తాడు. అయితే ఆధ్య మాత్రం మా అమ్మ వ‌కుళ‌ (ఖుష్బూ)కి న‌చ్చ‌ని ప‌ని ఏదీ చేయ‌ను అని ఖ‌రాఖండీగా చెప్పేస్తుంది. ఈ క్రమంలో ఆధ్యను పెళ్లి చేసుకునేందుకు శర్వా పడిన తంటాలు ఏంటి…?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందేనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటులు,కామెడీ,టెక్నీషియన్స్ పనితనం,నిర్మాణ విలువలు. శర్వానంద్‌ నటన సహజంగా ఉంది. రష్మికా మందన్న స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. రాధిక, ఊర్వశి, ఖుష్బూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ‘వెన్నెల’ కిశోర్‌, సత్య, ప్రదీప్ రావత్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో సత్య కృషన్, రాజశ్రీ నాయర్‌, కళ్యాణీ నటరాజన్, ఝాన్సీ, రజిత, బెనర్జీ, గోపరాజు రమణ, రవిశంకర్‌ తదితరులు కనిపిస్తారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ పేలవమైన కథ, కథనం,సన్నివేశాలు బలంగా లేకపోవడం. ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితం నాటి కథాంశాన్ని తీసుకుని, ఈ తరానికి చెప్పాలని దర్శకుడు కిశోర్‌ తిరుమల ప్రయత్నించాడు. కానీ కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ఓకే. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ, ఎ. శ్రీకర ప్రసాద్‌ ఎడిటింగ్‌ వర్క్ బాగుంది. నిర్మాణం విషయంలో నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఎక్కడా రాజీ పడలేదు. క్లీన్ ఎంటర్‌ టైనర్‌ కావడమే ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్‌.

తీర్పు:

ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా విడుదలకు ముందే భారీగా సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. శర్వా నటన,కామెడీ సినిమాకు ప్లస్ కాగా కథ,కథనం మైనస్ పాయింట్‌. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు.

విడుదల తేదీ:04/03/2022
రేటింగ్:2.5/5
నటీనటులు: శర్వానంద్,రష్మికా
సంగీతం:దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత:సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: కిషోర్ తిరుమల

- Advertisement -