టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. కాజల్ గర్భవతి అయినప్పటి నుంచి ముంబైలోనే ఉంటోంది. తన భర్త గౌతమ్ కచ్లుతో, ఫామిలీ మెంబర్స్ తో సంతోషంగా గడుపుతోంది. ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తోంది. ఇక బిడ్డ ఆరోగ్యం, తన ఆరోగ్యం కోసం ఏరోబిక్స్, పైలెట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్‌స్టా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు.
గర్భం దాల్చడం అనేది ఓ వినూత్న అనుభూతి. ఎలాంటి సమస్యలు లేని గర్భవతులను ఏరోబిక్స్ చేయడానికి ప్రోత్సహించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరానికి బలాన్ని చేకూర్చే వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఇంతకుముందు చేసిన ఎక్సర్‌సైజ్‌ల వల్ల, ఇప్పుడు గర్భం దాల్చాక చేస్తున్న వాటి వల్ల ఫిట్‌గా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ఏరోబిక్స్, పైలెట్స్ వల్ల నాకు అదనపు బలం వచ్చినట్లు అనిపిస్తోంది. అయితే కఠినమైన ఏరోబిక్స్ చేయడం ఇప్పుడు సరికాదు. తేలికపాటివి చేస్తే సరిపోతుంది అంటూ కాజల్ పేర్కొంది.