‘భోళా శంకర్’.. చిరు ఫస్ట్ లుక్ వచ్చేసింది..

126
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ‘మహాశివరాత్రి’ సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చిరు మరింత స్టయిల్‌గా కనిపించనున్నారనే విషయం ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. ఇక ఈ ఫస్ట్‌లుక్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లిగా కనిపించనున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

- Advertisement -