- Advertisement -
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత జిల్లాగా చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ బస్టాండ్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుట్టిన పసిబిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 23,331 పల్స్ పోలియో కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 869 ట్రాన్సిట్ కేంద్రాలను అందుబాటులో ఉంచిందని అన్నారు.
- Advertisement -