మహా శివరాత్రికి మెగాస్టార్ సర్‌ప్రైజ్‌..

89
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిల్లో ఒకటి ‘భోళా శంకర్’.ఈ మూవీ తమిళ వేదాళం మూవీకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా కీలక పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా హీరోయిన్‌గా తమన్నా అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలో చిరంజీవికి సంబంధించిన లుక్‌ను మహా శివరాత్రి కానుకగా ఉదయం 9.05 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మహా శివరాత్రి రోజున.. భోళా శంకరుడిగా.. మెగాస్టార్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరు నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది.

- Advertisement -