శ్రీలంకను చిత్తుచేసిన టీమిండియా..

159
ind
- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక..6 వికెట్లు కొల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది టీమిండియా.

శ్రీలంక ఆటగాళ్లలో అసలంక 53,చండిమాల్ 10,మిశ్రా 13,కరుణరత్నే 21,చమీరా 24 పరుగులు చేయగా భువనేశ్వర్ కుమార్ 2,వెంకటేశ్‌ అయ్యర్ 2,చాహల్ 1,జడేజా 1 వికెట్ తీశారు.

ఇక అంతకముందు టాస్ గెలిచ శ్రీలంక…భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ 44,ఇషాన్ కిషన్ 89 రుగులు చేయగా తొలి వికెట్‌కు 11 పరుగులు చేశారు. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యార్ 57 పరుగులతో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కొల్పోయి 199 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టీ20 మ్యాచ్‌ల్లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి.

- Advertisement -