షాకింగ్..ఐరాస సిబ్బంది కిడ్నాప్

85
uno
- Advertisement -

యెమెన్‌లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బంది అపహరణకు గురయ్యారు. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్‌లో పనిచేస్తుండగా వారిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.

వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్‌లో ఐరాసా అధికారి రస్సెల్‌ గీకీ తెలిపారు. యెమెన్‌లో 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూప్‌కి మధ్య పోరు జరుగుతుండగా ఇప్పటివరకు పదివేలకు పైగా మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

- Advertisement -