పేద ప్రజలకు పెద్దపీట : ఈటల

257
Etela Rajender To Introduce Ts Budget
- Advertisement -

అన్ని సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ఉన్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బడ్జెట్ 2017-18ని తయారు చేయడం జరిగిందన్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియాతో మంత్రి ఈటల మాట్లాడారు. బడ్జెట్ రూపకల్పనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ. 1,49,446 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. గతంలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పారు.

కులవృత్తుల వారికి ఆధునిక సాంకేతికత అందించి సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మేకలు, గొర్రెలు, పశువులు, కోళ్లు, చేపల పెంపకందారులకు సాయం చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. వృత్తిదారుల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సూచిక అని పేర్కొన్నారు. కుల వృత్తులకు కేటాయింపులతో అన్ని వర్గాలకు లాభం చేకూరుతుందన్నారు. పెన్షన్లు, బియ్యం ఇవ్వడమే ప్రభుత్వ పని కాదు. ప్రజల్లో నైపుణ్యాన్ని గుర్తించి వారు ఎదిగేలా చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వ పని అన్నారు. నైపుణ్యాన్ని గుర్తించి తగిన తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామని తెలిపారు.

- Advertisement -