- Advertisement -
బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వరాలు ప్రకటించారు. పేద కుటుంబానికి చెందిన యువతుల వివాహం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని తాజా బడ్జెట్‌లో పెంచింది. ఇప్పటివరకూ రూ.51వేలుగా ఉన్న మొత్తాన్ని రూ.75.116కు పెంచుతున్నట్లు ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
పేదింటి ఆడపడుచుల పెళ్లికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట్లో కేవలం ఎస్సీ, ఎస్టీవారికే ఈ పథకాన్ని అమలు చేసినా.. తర్వాత బీసీలను కూడా ఇందులో చేర్చారు. ఇక ముస్లిం యువతుల కోసం షాదీ ముబారక్ పేరుతో ఇంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం శాసనసభలో 2017-18 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు.
- Advertisement -

