ఆస్కార్..జై భీమ్‌కు నిరాశ

50
jai bhim
- Advertisement -

ఆస్కార్ అవార్డుల్లో భారతీయ సినిమాకు నిరాశే ఎదురైంది. ఆస్కార్ అవార్డులకు షార్ట్‌లిస్ట్ అయిన జైభీమ్ , మరక్కర్ చిత్రాలు నామినేషన్ వరకూ వెళ్లలేకపోయాయి. ఈ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆ ఆశ ఆవిరైంది. జైభీమ్ చిత్రం ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ వరకే పరిమితమైంది.

కాగా, కరోనా కారణంగా గతేడాది ఇలాంటి అవార్డు కార్యక్రమాలు కొన్ని వాయిదా పడ్డాయి, మరికొన్నింటిని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల విజేతలను జనవరిలో కేవలం ట్వీట్ చేసి వెల్లడించారు. కనీసం టీవీల్లో కూడా చూపించలేదు. ఇలాంటి సమయంలో 2022వ సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని డాల్బీ థియేటర్లో మార్చి 27న నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మార్చి 1 నుంచి 2021 డిసెంబరు 31 మధ్య విడుదలైన చిత్రాలకే ఈ పోటీలో ప్రవేశం కల్పించారు.

- Advertisement -