యాదాద్రిని సందర్శించిన మంత్రి హరీష్‌..

48
- Advertisement -

రాష్ట్ర మంత్రి హరీష్ రావు గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట నియోజకవర్గ పక్షాన యాదాద్రి ఆలయ గోపుర బంగారు తాపడ నిర్మాణానికి కిలో బంగారాన్ని స్వామికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకుల తరపున సమర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దాదాపు పూర్తి అయింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట నియోజక వర్గం నుండి ఒక కిలో బంగారం సమర్పించడం జరిగిందన్నారు. మరో కిలో బంగారం కూడా సమర్పిస్తామని మంత్రి తెలిపారు.

ఇప్పటివరకు దాతల నుండి,భక్తుల నుండి దాదాపు 35 కేజీల బంగారం సమర్పించారు. మరో 45 కేజీల బంగారం దాతలు ఇతర భక్తులు ఇస్తాం అని చెప్పారు. బంగారు గోపురం తాపడానికి కావాల్సిన బంగారం దాతల నుండి అందుతుంది. సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రత్యేక శ్రద్ధతో అద్భుతంగా నిర్మాణం చేశారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే గొప్ప ఆలయంగా యాదాద్రి ఆలయం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో మంచి పర్యటక, ఆధ్యాత్మిక ప్రదేశంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిలుస్తోంది. కాగా, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ 100 పడకల హాస్పిటల్‌ను అడిగారు, తప్పకుండా ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్‌ హామీ ఇచ్చారు.

- Advertisement -