రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి..

99
drill
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ విధానంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టగా తాజాగా ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ డ్రిల్ మెక్‌స్పా భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్ సెక్టార్‌లో రారాజుగా వెలుగొందుతున్న డ్రిల్ మెక్‌స్పా ..దాదాపుగా రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 2500 మందికి ఉపాధి లభిస్తుందని టీఆర్‌ తెలిపారు. ఆయిల్‌, నేచురల్‌ గ్యాస్‌ వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో డ్రిలింగ్‌ స్పా కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉంది.

డ్రిల్‌మెక్‌ స్పా వంటి గ్లోబల్‌ కంపెనీ తెలంగాణకు రావడం వల్ల నేచురల్‌ గ్యాస్‌ సెక్టార్‌లో తెలంగాణ పురోగతి సాధించే అవకాశం ఉంది.

- Advertisement -