45 ఏండ్ల క్రితం..రేర్ ఫోటోషేర్ చేసిన కేటీఆర్

138
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో అప్పుడప్పుడు పాత స్మృతులను గుర్తు చేస్తూ, దాని తాలుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. తన స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఫోటోలను ఒకట్రెండు సార్లు కేటీఆర్ షేర్ చేశారు.

తన చిన్నప్పటి ఫోటోను మంత్రి కేటీఆర్ షేర్ చేసి అందర్నీ తమ పసి వయసు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు. 45 ఏండ్ల క్రితం నాటి ఫోటోను కేటీఆర్ షేర్ చేసి.. అప్పుడు, ఇప్పుడు అని ట్వీట్ చేశారు. ఆ ఫోటో కేటీఆర్ పసి వయసులో ఉన్నప్పటిది.

జూన్ 27, 2021న తన నాలుగో తరగతి బ్యాచ్ ఫోటోను కేటీఆర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. 1984లో నాలుగో తరగతి చదువుకొనే సమయంలో స్కూల్ లో దిగిన ఫోటోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. తన మిత్రుడు తనకు ఈ ఫోటోను పంపాడని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు..డిసెంబర్ 10, 2021నాడు.. తాను ఇరవై ఏళ్ల క్రితం లండన్‌లో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా 2001లో లండన్ లో తన స్నేహితుడితో ఉన్న ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

- Advertisement -