బుద్దా వెంకన్న అరెస్ట్ అప్రజాస్వామికం..

60
ravindra
- Advertisement -

బలహీన వర్గాల నాయకుడు బుద్దా వెంకన్న అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం అన్నారు మాజీమంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తుందని….వైసీపీ మంత్రులు, నాయకులు పచ్చి బూతులు మాట్లాడుతూ బహిరంగంగా బెదిరిస్తూ దాడులు చేస్తుంటే పోలీసులు స్పందించలేదన్నారు. అదే బలహీన వర్గాల నాయకుడు బుద్దా వెంకన్న బుతులమంత్రి కొడాలి నాని చంద్రబాబు గారిని తిట్టిన దానిని ఖండించి గంటకు అతన్ని అరెస్ట్ చేస్తున్నారన్నారు.

అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అని దుయ్యబట్టిన కొల్లు రవీంద్ర….కొడాలి నాని మొన్న గుడివాడకు వస్తే తిరిగే ఎవదువెళ్లడు అని బహిరంగంగా బెదిరించి మాపై అనుచరులు దాడి చేస్తే ఒక పోలీస్ కూడా స్పందించలేదు. కానీ ఈ రోజు ప్రశ్నించిన గొంతులు నొక్కుతూ పాలన సాగిస్తున్నారన్నారు.

జగన్ పాలన ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మనుగడకు ముప్పుల ఉంది. కర్నూల్ లో సలాం కుటుంబం, విశాఖలో డాక్టర్ సుధాకర్ మరణాలకు కారణం ఈ ప్రభుత్వం అని ఆరోపించారు. ఈ రోజు బుద్ధవెంకన్న అక్రమ అరెస్ట్ ను చికటిరోజుగా భావిస్తున్నాం….ప్రభుత్వానికి, జాగన్కు కొమ్ము కాసే పోలీసులకు తగిన బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, ఎన్ని అరెస్టులు చేసినా ఈ ప్రభుత్వం పై మా పోరాటం ఆగదు అని హెచ్చరిస్తున్నా అన్నారు.

- Advertisement -