ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ..

63
- Advertisement -

ఆల్ ఇండియా స‌ర్వీసెస్ రూల్స్ స‌వ‌ర‌ణ‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో ఆయన ప్ర‌ధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌లు రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రిస్తాయ‌ని లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగంలో ఉన్న స‌మాఖ్య స్ఫూర్తికి ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌లు విరుద్ధం అని సీఎం అన్నారు. ఆల్ ఇండియా స‌ర్వీసుల‌లోని ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ స‌ర్వూపాన్నే స‌వ‌ర‌ణ‌లు మార్చేస్తాయ‌ని.. అందుకే ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ లేఖ‌లో వెల్ల‌డించారు.

- Advertisement -