దేశంలో మొదలైన కరోనా థర్డ్ వేవ్..

115
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశంలో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 124 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,60,261కి చేరగా కరోనా మరణాల సంఖ్య 4,82,017కి పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 1,46,70,18, 464 కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందని కోవిడ్ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డా. ఎన్‌కే అరోరా స్పష్టం చేశారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వే అని ఆయన తెలిపారు.

దేశంలో గత నాలుగైదు రోజులుగా అధిక సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయని కోవిడ్ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడమే ఉత్తమ మార్గమని సూచించింది.

- Advertisement -