నందమూరి బాలకృష్ణ హెస్ట్‌గా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న షో అన్‌స్టాపబుల్ విత్ బాలయ్య. ఈ షోకు మంచి రేటింగ్ వస్తుండగా తాజాగా 8వ ఎపిసోడ్‌లో రానా సందడి చేశారు. ఈ మేరకు ప్రోమోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. టాక్ షోలలోనే ది బెస్ట్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ దూసుకుపోతోందని రానా చెప్పగా… కొత్తగా చెప్తావేంటయ్యా… బాలయ్య అంటేనే బెస్ట్ అంటూ బాలయ్య కౌంటర్ ఇచ్చారు.
తాము టాక్ షోలలో మాములు ట్రైన్‌లలో వెళ్తుంటే మీరు బుల్లెట్ ట్రైన్‌లో దూసుకువెళ్తున్నట్లు అనిపిస్తోంది అంటూ బాలయ్యతో చెప్పారు రానా. లాక్‌డౌన్‌లో వ్యాక్సిన్ వస్తుందనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబూ అంటూ రానాతో బాలయ్య సరదాగా చెప్పగా మీరెప్పుడైనా వసుంధరగారికి ఐలవ్‌యూ అని చెప్పారా అని రానా అడగ్గా.. నీకెందుకయ్యా అంటూ బాలయ్య నవ్వులు పంచారు. ఈ ఎపిసోడ్ ఈనెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.