టీఆర్ఎస్‌లో చేరాలనుకుంటే..నన్నెవరు ఆపలేరు:జగ్గారెడ్డి

17
jaggareddy

తాను కేటీఆర్ కోవర్ట్ నంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి… టీఆర్ఎస్ ఏజెంట్ నంటూ కొంతమంది ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీఆర్ఎస్‌ వెళ్లాలనుకుంటే నేరుగానే వెళ్తానని ..నన్నెవరు ఆపలేరన్నారు.

ప్రత్యర్థి పార్టీల నేతలు ఎదురుపడినప్పుడు పలకరించడం, మాట్లాడడం సంస్కారం అని స్పష్టం చేశారు. కేటీఆర్ తోనూ ఆ విధంగానే మాట్లాడానని…కేటీఆర్ తన భుజంపై చేయి వేసినా, తాను ఆయన భుజంపై చేయి వేయలేదని వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ తయారైందని …కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుంది ఎవరో త్వరలో అందరికి తెలుస్తుందన్నారు.