శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి మురుగన్‌..

199
murugan
- Advertisement -

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ‌ సమయంలో కేంద్ర సహాయక మంత్రి ఏల్.మురుగన్, బిజేపి నేత భానుప్రకాష్ రెడ్డిలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి‌ రంగనాయకుల‌ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి‌ స్వామి వారి తీర్ధ ప్రసాదాలు‌ అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన బిజేపినేత‌ భానుప్రకాష్ రెడ్డి‌ మీడియాతో మాట్లాడుతూ.. అన్నమయ్య మార్గం గుండా తిరుమలకు చేరుకున్న వేదాలంది మంది భక్తులకు టీటీడీ దర్శనభాగ్యం కల్పించిందని, అదే ప్రాతిపదికన దూర ప్రాంతాల నుంచి నడిచి వస్తున్న వారికీ వైకుంఠ ఏకాదశికి భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలని‌ ఆయన కోరారు.. అధికార పార్టీ నేతలతో వస్తే ఒకలా, భక్తితో వస్తే మరోలా టిటిడి చూడకూడదన్నారు.. కొన్ని వందల మైళ్ళు నడిచి వచ్చే భక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -