- Advertisement -
కఠినమైన వాతారవణంలో ఎలా జీవించవచ్చు, ఎలా మనుగడ సాగించవచ్చు. ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి, వాటిని ఎలా ఎదుర్కొనగలగాలి అనే అంశాలను పరిశోధన చేసేందుకు ఇద్దరు సాహసికులు చేపట్టిన యాత్ర విజయవంతంగా సాగుతోంది. నవంబర్ 12న 3600 కిమీల పాదయాత్రకు శ్రీకారం చుట్టిన వీరు..డిసెంబర్ 15 నాటికి 1083 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేశారు.
దాదాపు 80 రోజుల పాటు ఈ పాద్రయాత్ర చేయనుండగా జస్టిన్ పాక్షా, జేమీ పేసర్లు మైనస్ 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో నడుస్తున్నారు. ఒకవేళ మనిషి చంద్రునిపైనా, మార్స్పైనా జీవించాలంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో చెప్పలేని పరిస్థితి. దానికోసం కూడా వీరి యాత్ర ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
- Advertisement -