దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు..

65
christamas

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులు దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా విజృంభిస్తుండటంతో నిబంధనల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ‌లోని మెద‌క్ సీఎస్ చ‌ర్చిలో ఈ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. శిలువ ఊరేగింపు మొద‌టి ఆరాధ‌న‌లో చర్చ్ బిష‌ప్ సాల్మ‌న్ రాజు పాల్గొన్నారు.

ఏపీలోనూ క్రిస్మ‌స్ వేడుక‌ల‌పై ఎలాంటి ఆంక్ష‌లు లేక‌పోవ‌డంతో అక్క‌డ కూడా రాత్రి నుంచి వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండ‌టంతో ఉద‌యం ఆరు గంట‌ల త‌రువాత ఆయా రాష్ట్రాల్లో క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతున్నాయి.