హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.

23
anand

హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. హైద‌రాబాద్ సీపీ ఉన్న అంజ‌నీ కుమార్‌కు డీజీగా పదోన్నతి రావడంతో ఆయన్ని ఏసీబీ డీజీగా బ‌దిలీ చేశారు. తెలంగాణ‌లో 30 మంది ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది.

ఇవాళ హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు సీవీ ఆనంద్. సిద్ధిపేట‌, నిజామాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ల‌తో పాటు 11 జిల్లాల ఎస్పీలు కూడా బ‌దిలీ అయ్యారు. మూడేళ్ల క్రితం ప్ర‌భుత్వం ఐపీఎస్‌ల‌ను బ‌దిలీ చేసింది. ఆ త‌రువాత మ‌ర‌లా ఇప్పుడు ఈ స్థాయిలో బ‌దిలీలు జ‌రిగాయి. అయితే, రాచ‌కొండ కమిషనర్‌ సీపీ భ‌గవ‌త్‌ను మాత్రం బ‌దిలీ చేయ‌లేదు.